![]() |
![]() |
.webp)
లవర్స్ డే సందర్భంగా ఎంతోమంది తమ లవ్ ని వాలైంటైన్ ని పరిచయం చేస్తూ జోరుగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇందులో కొంతమంది తమ ఫోటోలని షేర్ చేస్తూ జ్ఞాపకాలని పంచుకోగా.. మరికొంత మంది వ్లాగ్స్ చేస్తూ తమ ప్రేమకథని నెటిజన్లతో పంచుకుంటున్నారు. వారిలో బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ నేహా చౌదరి కూడా ఇంది. నేహా చౌదరి తన లవ్ స్టోరీ చెప్తూ ఓ వ్లాగ్ చేసింది.
నేహా తన కెరీర్ ని యాంకరింగ్ తో మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి తనకి యాంకరింగ్, యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేదంట. విమెన్ వరల్డ్ కప్ ప్రోకబడ్డికి కూడా రెప్రెజెంటెర్ గా చేసింది నేహా. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా సెలెబ్రిటీ జాబితాలోకి చేరింది నేహా. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాకే నేహాకి పెళ్లి జరిగింది అది కూడా బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే నేహా పెళ్లి జరిగింది.. నేహా పెళ్లి కూతురు గెటప్ లోనే గ్రాండ్ ఫైనల్ కి అటెండ్ అయిన విషయం అందరికి తెలిసిందే. నేహా తన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి తన ప్రతీ అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి తెలియజేస్తుంది. పెళ్ళి తర్వాత కొత్త లైఫ్ ని ఎంజయ్ చేస్తోంది. సర్ ప్రైజ్ అంటూ తన భర్తని కలవడానికి వెళ్ళి ఒక వ్లాగ్ అప్లోడ్ చేయగా వైరల్ అయ్యింది. బర్త్ డే సర్ ప్రైజ్ వ్లాగ్, అవుటింగ్ అంటు ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది నేహా చౌదరి. అయితే ఈ వ్లాగ్స్ ని తన పర్సనల్ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తుంది నేహా చౌదరి.
నేహా చౌదరి పెళ్ళి చేసుకొని జర్మనీకి వెళ్ళింది. అక్కడ నుండి వ్లాగ్స్ చేస్తూ వాటిని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అవి విశేష ఆదరణ పొందుతున్నాయి. తాజాగా లవర్స్ డే సందర్భంగా వారి ప్రేమకథ ఎప్పుడు మొదలైందో చెప్పుకొచ్చింది. నేహా మాట్లాడుతూ.. మా లవ్ స్టోరీలో చాలా ట్విస్ట్ లున్నాయి. మొదట తను నా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తే నేను టైమ్ అడిగాను. అయితే అతను మాత్రం నామీద ఉన్న ప్రేమని చెప్పడానికి అయిదు సంవత్సరాలు తీసుకున్నాడు. ఇదే విషయం మా నాన్నతో చెప్పగా.. ఇతనే ఎందుకని అడిగాడు. కొన్ని రోజులు ఆలోచించాను. అతను నా ఫ్రెండ్ కాబట్టి నన్ను బాగా అర్థం చేసుకుంటాడని అనుకున్నానంటూ చెప్పుకొచ్చింది. మా లవ్ స్టోరీ పార్ట్ - 2 అనే టైటిల్ తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ అప్లోడ్ చేయగా అది ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది.
![]() |
![]() |